పర్లేదు.. బాగా డెవలప్ అయ్యారు : విదేశాలకు వెళుతూ బీజేపీని గిల్లి మరీ వెళ్లిన రాహుల్

rahulరాహుల్ గాంధీ.. విదేశాలకు వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే ఉండనున్నారు. అయితే వెళుతూ వెళుతూ సోషల్ మీడియాను గెలికారు.. అంతే కాదు బీజేపీ పార్టీకీ చురకలు అంటించారు. గతంలో ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయని రాహుల్.. ఈసారి చెప్పి మరీ.. గిల్లీ వెళ్లటం విశేషం. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కామెడీ సెటైర్లతో హడావిడి అవుతోంది.

నేను కొన్ని రోజులు ఇండియా బయట ఉంటాను. తల్లి సోనియాగాంధీ రెగ్యులర్ చెకప్ కోసం వెళ్తున్నాను. నా మిత్రులైన బీజేపీ సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీకి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు మరీ ఎక్కువగా కష్టపడొద్దు.. నేను అతి త్వరలోనే వచ్చేస్తాను అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ఈ పంచ్ కు కౌంటర్ వేయటానికి బీజేపీ కొంచెం సమయం తీసుకుంది. కానీ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. సోనియాగాంధీ వెంటనే కోలుకోవాలని ఆశిస్తున్నాం.. కర్నాటకలో ఇంకా మంత్రివర్గం కొలువుదీరలేదు. పొత్తులు ఖరారు కాలేదు. ప్రజలు కూడా ప్రజాపాలన కోసం ఎదురుచూస్తున్నారు. మీరు వెళ్లేలోపు పని చేసే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటూ కర్నాటక ఇష్యూను హైలెట్ చేశారు. సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరూ కూడా.. మీరు అక్కడి నుంచే మమ్మల్ని ఎంటర్ టైన్ మెంట్ చేస్తారని ఆశిస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా రాహుల్ లోని లోపాలను ఎత్తిచూపుతూ ట్రోల్ మొదలుపెట్టేసింది.

రాహుల్ గాంధీ విదేశాలకు వెళతూ బీజేపీకి ఇచ్చిన పంచ్.. ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద చర్చకు దారితీసింది. గిల్లి మరీ వెళ్లాడు కదా.. పర్లేదు.. రాహుల్ బాగా డెవలప్ అయ్యాడు అంటూ కొందరు అంటే.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో ప్రజలకు సరైన వైద్యం లేదు అనటానికి ఇదో ఉదాహరణ అంటూ మరికొందరు కౌంటర్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates