పలు జిల్లాల్లో పెథాయ్‌ ముప్పు

అమరావతి : పెనుతుపానుగా మారిన ‘పెథాయ్‌’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంలను అతలాకుతలం చేస్తోంది. అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం.ఆ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. పెథాయ్‌ కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి దివిసీమ ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల్లో కోత కొచ్చిన వరి పడిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేసి, 283 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, ఆచంట మండలాల్లో భారీ వర్ష ప్రభావంతో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇవాళ (సోమవారం) కలెక్టరేట్ లో నిర్వహించే మీ కోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.

Posted in Uncategorized

Latest Updates