పల్లెపల్లె తిరిగేస్తాం : ఇంటి దగ్గరకే మొబైల్ ATMలు

32857683-8466-48f8-9a37-2d8fe336b346

డబ్బులు కావాలంటే బ్యాంక్ కు వెళ్తాం.. అర్జంట్ గా కావాలంటే ATM సెంటర్ కు పరిగెడతాం.. ఇక నుంచి ఆ అవసరం లేదంటున్నాయి బ్యాంకులు. మీ ఇంటికి ATM మిషన్ వస్తోందని చెబుతోంది. అంతేకాదు.. ఆచరణలో కూడా పెట్టేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు పల్లెల్లెల్లో ఏటీఎం వాహనాలు తిరుగుతున్నాయి. వీధివీధి తిరుగూతు డబ్బులు డ్రా చేసుకోండి అని ఆఫర్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సహకార బ్యాంకు వినూత్న ప్రయోగం చేపట్టింది. మొత్తం 10 మొబైల్ ATM వాహనాలను రోడ్డెక్కించింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ వాహనం ఇప్పటికే చక్కర్లు కొడుతోంది.

ఈ 10 మొబైల్ ఏటీఎం వాహనాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు నగదు అందించనున్నాయి. మీ దగ్గర ఏ బ్యాంక్ ఏటీఎం ఉన్నా పర్వాలేదు.. మీ ఖాతాలో డబ్బులు ఉంటేచాలు డ్రా చేసుకోవచ్చని చెబుతోంది. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఏటీఎంలు అందుబాటులో లేవు. ఉన్న సెంటర్లలోనూ నో క్యాష్, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. దీంతో డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఖాతాదారులది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ సహకార కేంద్ర బ్యాంకులు ఈ మొబైల్ ఏటీఎంలను తీసుకొచ్చాయి. ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఇంటి దగ్గరకే ఏటీఎం మిషన్ తీసుకెళుతూ నగదు కష్టాలను తీరుస్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates