పవన్ అడిగితేనే విడాకులిచ్చా : రేణూదేశాయ్

RENU జనసేనాని పవన్ కళ్యాణ్ తో విడాకుల వ్యవహారంపై స్పందించారు రేణూదేశాయ్. తాను ఏదో తప్పు చేసినట్లుగా కొంతమంది పవన్ అభిమానులు తనపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని, పవన్ అడిగితేనే తాను విడాకులిచ్చానని రేణూదేశాయ్ సృష్టం చేసింది. మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్, ఇద్దరు పిల్లలున్న నీకు రెండో పెళ్లి ఎందుకంటూ కొంతమంది పవన్ మహిళా అభిమానులు కూడా తనను కామెంట్ చేస్తున్నారని రేణూదేశాయ్ తెలిపింది. ఓ వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకొని…11 ఏళ్లుగా కాపురం చేస్తూ… మీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఓ బిడ్డను కంటే మీకెలా ఉంటుందని తనను కామెంట్ చేసే మహిళలను ఉద్దేశించి రేణూ అన్నారు. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఇన్ని మాటలు భరించాలని తనకు కాబోయే అత్తమామలు అడిగారని, అందుకే ఇప్పుడు ఈ నిజం చెప్పదలుచుకునకున్నానని రేణూ తెలిపింది. అయితే పవన్ కు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన మాత్రం ఉందని, వ్యక్తిగతంగా జీవితంలో కాస్త పొరపాటు ఉండవచ్చు కానీ, సామాజిక విషయాల్లో పవన్ స్ట్రాంగ్ అని రేణూ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates