పవన్ అభిమానులపై రేణూదేశాయ్ ఆగ్రహం

renuసోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేణూ దేశాయ్‌. పవస్ అభిమానుల నెగటివిటినీ భరించాల్సినంత తప్పు తానేం చేశానని రేణూదేశాయ్ ప్రశ్నించారు. గురువారం(జూన్-28) తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా పవస్ కళ్యాణ్ అభిమానులను వార్నింగ్ ఇచ్చారు రేణూ దేశాయ్. నోరు తెరచి, పవన్ తో విడాకుల వెనుక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన, మర్యాద తెలియని అభిమానులకు గర్వభంగం అవుతుందని రేణూదేశాయ్ అన్నారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలోకి వచ్చి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు లేదన్నారు. ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞులుగా ఉండాలన్నారు. స్వేచ్ఛగా సోషల్‌ మీడియాలో నా గురించి, నా పని గురించి కామెంట్లు చదువుకొనే రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రేణూదేశాయ్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates