పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు ప్రమాదం : రామ్ గోపాల్ వర్మ

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్లతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వెన్నుపోటు ప్రమాదం పొంచి ఉందని వర్మ సోషల్ మీడియాలో చెప్పాడు. తనకున్న ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం… జనసేనలో ఇటీవల చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ .. పవన్ కల్యాణ్ ను వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. గతంలో ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచాడని.. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా చేస్తారేమోనని తనకు ఆందోళనగా ఉందని ఆయన అనుమానపడ్డాడు. ఒక అభిమానిగా ఈ విషయం చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అధినేతకు జాగ్రత్తలు సూచించాలని చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ను పవన్ కల్యాణ్ అభిమానులు తేలిగ్గా తీసుకుంటున్నారు. తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను ఈ సాయంత్రం వర్మ విడుదల చేస్తున్నాడు. ఆ పాటకు, సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా… ప్రజల్లో పేరున్న నాయకుడికి వెన్నుపోటు ప్రమాదం ఉందంటూ కామెంట్లు చేస్తున్నాడని అంటున్నారు.

పీకేపై కామెంట్స్ తో పాటు.. లక్ష్మీస్ ఎన్టీఆర్, బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను పోల్చుతున్నట్టుగా ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు వర్మ. ఇందులో బాలకృష్ణ, వర్మ వాయిస్ లు ఉన్నాయి. ఈ వీడియో ఎవరు క్రియేట్ చేశారో తనకు తెలియదని ఓ కామెంట్ పెట్టాడు ఆర్జీవీ.

Posted in Uncategorized

Latest Updates