పవన్ కల్యాణ్ ట్విట్టర్ వార్

గత ఎన్నికల్లో TDP కి మద్దతిస్తే రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమైనా ఓట్లు చీలతాయని చెప్పి… ఆ ఆలోచన చేయవద్దని చంద్రబాబు చెప్పారని అన్నారు పవన్. రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి.. మరుసటి రోజు అదే విషయాన్ని పత్రికల్లో రాయించారని వివరించారు. అప్పుడే బాబుపై నమ్మకం పోయిందన్నారు పవన్. తనను అనుభవం లేని రాజకీయ నాయకుడిగా ప్రచారం చేస్తున్నారని.. వారంతా రాజకీయ అనుభవంతో పుట్టారా అన్ని ప్రశ్నించారు జనసేన చీఫ్. నిన్న విజయవాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పవన్.

Posted in Uncategorized

Latest Updates