పవన్ కల్యాణ్ పిలుపు : తెలంగాణలో ఉన్నట్లే.. ఏపీకి హోదాపై JAC ఏర్పాటు

Pawanప్రత్యేక హోదాపై అప్పట్లో సమర్ధించిన మాట వాస్తవమే అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విభజన హామీలపై బీజేపీ, టీడీపీ వెనక్కి వెళ్లిన తర్వాత కూడా ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కంటే ప్యాకేజీ బాగుంది అని సీఎం చంద్రబాబు కొన్నాళ్లు అంటున్నారు.. కొన్నిసార్లు బాగోలేదంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండి పడ్డారు. ఏపీ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. గతంలో తెలంగాణ కోసం JAC వంటిది ఏర్పడినట్లుగానే.. ఏపీలోనూ ప్రత్యేక హోదా కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జనసేన గొంతు ఒక్కటే సరిపోవటం లేదన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ముందుకు రావాలన్నారు. వారితో చర్చించి ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. టీడీపీపై నమ్మకం పోతుందన్న పవన్.. అటు అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్లకార్డులతో సమస్యలు పరిష్కారం కావన్నారు పవన్ కల్యాణ్.

Posted in Uncategorized

Latest Updates