పవన్ కు స్వల్ప గాయం

జనసేన అధినేత పవన్ కు స్వల్ప గాయమైంది. మంగళవారం (జూలై-24) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన కుడికాలు బెణికింది. బీమవరంలోని ఓ ఫంకషన్ హాలులో కార్యకర్తలను కలిసేందుకు వస్తున్న క్రమంలో నేల తడిగా ఉండటంతో పవన్ కాలు స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన కాలు బెణికింది. వెంటనే బ్యాండేజీతో కట్టు వేశారు. నొప్పితో ఇబ్బందిపడ్డారు. ఆ నొప్పితోనే జన సైనికుల్ని కలిసి మాట్లాడారు.

వైద్యులు వచ్చి పరీక్షించారు. నొప్పి నివారిణులు వాడాలని చెప్పారు. కాలుకి క్యాప్ వేసి స్వల్ప విశ్రాంతి అవసరం అని సూచించారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates