పవన్ – జేపీ భేటీ : విభజన హామీలపై పోరాటం చేస్తాం

pavanవిభజన సమస్యలు, కేంద్రం హామీల అమలుపైనే పోరాడతామన్నారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇదే విషయంపై లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ తో పవన్ సమావేశమయ్యారు. మరింత మంది మేధావులను ఈ ప్రయత్నంలో కలుపుకొని పోతామన్నారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విభజన సమయంలో జేపీ ఎంతో అధ్యయనం చేశారని..దీనిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని.. విభజన హామీలను నేరవేరుస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఈ సమస్యల సాధన కోసం జేపీ, ఉండవల్లి వంటి వారితో కమిటీ వేసి పోరాటం చేస్తామన్నారు పవన్.

పవన్ చొరవను స్వాగతిస్తున్నామన్నారు జేపీ. పార్లమెంట్ సాక్షిగా తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను.. కేంద్రం విస్మరిస్తోందన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసేలా కేంద్రం తీరు ఉందన్నారు జయప్రకాష్ నారాయణ్. విభజన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని…రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నారు. విభజన హామీలపై పవన్ చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నానన్నారు. విభజన సమయంలో పోరాటం చేసిన మేథావులు చాలా మంది ఉన్నారని… అందరితో కలిసి మాట్లాడతామన్నారు జేపీ.

Posted in Uncategorized

Latest Updates