పవన్ ట్విట్ : ఆ సమయంలో ఏడో తరగతి చదువుతున్నాను

PK MEGAజనసేన అధినేత పవన్ తన చిన్ననాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన తోబుట్టువులతో ఉన్న ఫోటోను గురువారం (జూలై-5) ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్. బ్లాక్ అండ్ వైట్‌ లో ఉన్న ఈ ఫొటోలో పవన్ తన తోబుట్టువులతో ఉన్నారు. ఈ ఫొటో గురించి పవన్ వివరిస్తూ.. అది నెల్లూరులో తీసుకున్న ఫొటో అని, అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నాని చెప్పారు. బ్రాంకైటిస్ (శ్వాసనాళము వాపు వ్యాధి)తో బాధపడుతూ కోలుకుంటున్న సమయంలో తీసుకున్న ఫొటో అదని ట్విట్ చేశారు పవన్. ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అక్క మాధవీరావు, చెల్లెలు విజయదుర్గ ఉన్నారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. పవన్ స్లిమ్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates