పవన్ ట్విట్ : నా తల్లి జోలికి వస్తే చావటానికైనా సిద్ధం

pawan-tweetశ్రీరెడ్డి వివాదం కొత్త మలుపు తిరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్ మాట్లాడగా..గురువారం (ఏప్రిల్-19) రాత్రి నుంచి ట్విట్టర్ లో సంచనల ట్విట్స్ చేశారు పవన్.  పవన్‌ కల్యాణ్‌ కు వ్యతిరేకంగా అనుచిత వాఖ్యలు చేసిన ఆమెపై పవన్‌ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై పవన్ ట్వీట్‌ తో కొన్ని మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు.

పవన్ చేసిన్ ట్విట్స్ ఇలా ఉన్నాయి..

ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ.. ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం…   మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి,కుటుంబాలు ఉండి,అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడ పెట్టుకొని అన్నింటికి మించి సమజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో (మీడియా) మాధ్యమాలల్లో ఉన్న మీరు అందరు కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను.. భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని… ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని.. మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసి స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారిగలిగినప్పుడు.

“అసిఫా” లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు… మీరందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా… మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కచెల్లెళ్లకు, మీ కూతురులకి, కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అదే సమయంలో పవన్ మరో ట్వీట్‌ చేశారు

స్వశక్తితో జీవించేవాడు… ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్దపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికేవాళ్లని, సంవత్సరాలుగా సంబంధంలేని వివాదాల్లోకి పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్నవాళ్లకి, కొన్ని మీడియా సంస్థలను చెతుల్లో పెట్టుకున్నవాళ్లకి, అంగబలం,అర్ధబలం ఉన్నవాళ్లకి. వాళ్లు చేసే అత్యాచారాలకి… స్వశక్తితో జీవించేవాడు… ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్దపడితే అసలు దేనికన్నా భయపడుతాడా? వెనకంజ వేస్తాడా?

అందుకే… నా ప్రియమైన అభిమానులకు,అక్కాచెల్లెళ్లకు,ఆడపడుచులకు,సైనికులకు నన్ను ఆదరించే ప్రతిఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు!! ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకెళ్తున్నాను, ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే.. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే “నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా.. అధికారం అనేది అండదండలు ఉన్న వారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడు అనుకుంటే చాలు అంటూ నమస్కారంతో ట్విట్ చేశారు పవన్.

చంద్రబాబుపై సంచలన ట్విట్

ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మరోవైపు సంచలన  ట్విట్స్ చేశారు పవన్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ పేరును ప్రస్తావిస్తూ, కొన్ని మీడియా సంస్థల పేర్లను సైతం ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. తనపై ఏపీ సచివాలయం వేదికగా కుట్ర జరిగింది అని..  పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ ఈ కుట్ర చేయించారు అని ట్విట్ చేశారు పవన్ కల్యాణ్.

Posted in Uncategorized

Latest Updates