పవర్ స్టార్ పంచ్ : టీడీపీలో నైతిక నరం లేదు..

NDA ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ రోజు పార్లమెంట్ లో టీడీపీ నాయకుల వాదన చాలా వీక్ గా, పేలవంగా ఉందన్నారు. స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకొని.. స్పెషల్ స్టేటస్ డిమాండ్ ను బలహీనపరిచి, నాశనం చేసి ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నైతిక నరం టీడీపీ నాయకులకు కొరవడిందని తాను ఫీల్ అవుతున్నాని పవన్ అన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’ కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా? అని పవన్ ప్రశ్నించారు.

ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి,ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా.. కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే,ప్రజలు నమ్ముతారు.. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు? అని పవన్ ట్వీట్ చేశారు. రాజనాథ్ సింగ్ గారి మాటలు ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే అంటం చూస్తుంటే.. టీడీపీ – బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిపి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తుందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి గతంలో ఏవిధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో తెలియజేస్తూ ఓ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ నాయకులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates