పశుగ్రాసం కొరత లేకుండా చూస్తాం : తలసాని

talasaniవేసవిలో పశువులకు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. 75 శాతం రాయితీపై ఇస్తున్న గడ్డి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆయన. సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు మంత్రి. పశువులకు సరైన సమయంలో వైద్యం అందుతుందన్నారు. గొర్రెల పంపిణీతో గొల్లకురుమల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. ఇప్పటికే 53 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పాడి, గొర్రెల పెంపకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Posted in Uncategorized

Latest Updates