పశ్చిమబెంగాల్ సమరం : బీజేపీ హటావో – దేశ్ బచావో అంటున్న దీదీ

పశ్చిమబెంగాల్ లో రాజకీయం మరింత హీట్ అయ్యింది. సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన స్లోగన్ తో ఇప్పుడు కాకరేపుతోంది. జూలై 21వ తేదీ శనివారం కోల్ కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అమరవీరుల దినోత్సవంలో ఈ పిలుపునిచ్చారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో అంటూ లక్షల మంది కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ దాడుల వల్ల ఎంతో మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోతున్నారని.. ఇదంతా బీజేపీ హత్యా రాజకీయాలకు నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ హటావో – దేశ్ జచావో నినాదంతో ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. 2019లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా శమరశంఖం పూరించినట్లు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి 40 సీట్లు గెలిచి బీజేపీకి షాక్ ఇవ్వాలని గట్టిగా కసరత్తు మొదలుపెట్టింది. కామ్రేడ్ల కంచుకోటను బద్దలు కొట్టిన దీదీకి ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయింది. రాష్ట్రంలో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి.. సీఎం మమతా బెనర్జీ ఇప్పటి నుంచే చెక్ పెట్టాలనే వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే ఆగస్ట్ 15వ తేదీ నుంచి బీజేపీ హటావో – దేశ్ బచావో పేరుతో ప్రచారం ప్రారంభిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates