పసికందును కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్

child-kidnappedహైదరాబాద్ కోఠి ప్రసూతి  ఆస్పత్రి నుంచి పసికందును కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కు చెందిన నైనా చిన్నారిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ బీదర్ లోని నయాకమాన్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర చిన్నారిని వదిలేసింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఆ సమాచారంతో అనుమానిత మహిళను ప్రశ్నించటంతో.. పాపను తానే కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకుంది. నిందితురాలు నైనా సొంతూరు కర్ణాటక రాష్ట్రం బీదర్ మెల్ గావ్. ఈమెకు హైదరాబాద్ కు చెందిన పండ్ల వ్యాపారితో కొన్నేళ్ల కిందట పెళ్లైంది. నైనాకు గతంలో రెండుసార్లు అబార్షన్ అయ్యింది. దీంతో చిన్నారిని కిడ్నాప్ చేసి తన బిడ్డగా నమ్మించాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates