పసిడి పండుగ : అక్షయ తృతీయ కోసం ముస్తాబవుతున్న జ్యువెలరీలు

GOLDసిటీలో పసిడి పండుగ సందడి మొదలైంది. కాకపోతే కస్టమర్ల కొనుగోళ్ల  సందడి కాదు.  వ్యాపారుల జ్యువెలరీ కలెక్షన్స్  సందడి. అక్షయ తృతీయకి టైం దగ్గర పడుతుండటంతో కొత్త కలెక్షన్స్ తెచ్చే పనిలో పడ్డారు వ్యాపారులు. కొందరు అక్షయ తృతీయ ఆర్డర్స్, ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారు. మరికొందరు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు  ముస్తాబవుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం లేదా వెండి ఇతర విలువైన వస్తువులు కొనడం ఆనవాయితీ.  సెంటిమెంట్ తో పసిడి కొనే కస్టమర్లు… ఆఫర్లు, డిజైన్లు చూసి కొనుగోళ్లు జరుపుతారు. అందుకే  వ్యాపారులు మార్కెట్ లో ఉండే డిజైన్స్ కు భిన్నంగా తమ షాపుల్లో కొత్త కలెక్షన్స్ తీసుకొస్తారు.  కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు, లక్కీ డ్రాలు పెడుతుంటారు. ఈ ఇయర్ అక్షయ తృతీయకు కుందన్, ముత్యాలు, రుబీస్, టెంపుల్ జ్యూవెలరితో పాటు ఎనో  రకాల  రాళ్లను ఉపయోగిస్తూ స్పెషల్ డిజైన్లను అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు.

ఎక్కువగా లక్ష్మీదేవి  లాకెట్స్, హారాల కలెక్షన్స్ సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అక్షయ తృతీయ సేల్స్ తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ సంవత్సరం GST ప్రభావం  కూడా  సేల్స్ పై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవడంతో అక్షయ తృతీయకు సేల్స్ బాగుంటాయని ఆశిస్తున్నారు కొందరు వ్యాపారులు. అక్షయ తృతీయకు మరో 14 రోజులే ఉండటంతో.. కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు వ్యాపారులు. ఏప్రిల్ 18 నుంచి అక్షయ తృతియ ప్రారంభకానున్న విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates