పసిఫిక్ సముద్రం లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

పసిఫిక్‌ సముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి  భారీ భూకంపం సంభవించింది. న్యూ కాలెడోనియా తూర్పు తీరంలో దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో 7.6 మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటే సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. న్యూ కలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంవైపున 155 కిమీటర్ల దూరంలో 10 కిమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ ప్రభావం ఉండొచ్చని పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌​ హెచ్చరించింది. భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే ప్రమాదముందని తెలిపింది.

 

 

Posted in Uncategorized

Latest Updates