పసి కూనే అనుకున్నారేమో : బంగ్లా చేతిలో భారత్ ఓటమి

BANGLA INDక్రికెట్ లో ఏ టీమ్ ను తక్కువ అంచనా వేయరాదు అని మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఉమెన్స్ ఆసియా కప్ టీ20లో భాగంగా బుధవారం (జూన్-6) మలేసియాలోని కౌలాలంపూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. వరుస విజయాలతో జోరు మీదున్న భారత అమ్మాయిలు.. పసికూన బంగ్లాదేశ్ అమ్మాయిల చేతిలో ఓటమిపాలయ్యారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. భారత్ బౌలింగ్‌ ను ధాటిగా ఎదుర్కొని 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ ను ఛేదించింది. దీంతో భారత్‌ పై 7 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. భారత్ బౌలర్లలో పూజా వస్ర్తాకర్(1/21), రాజేశ్వరీ గైక్వాడ్(1/26), పూనమ్ యాదవ్(1/21) కొంతమేర కట్టడిచేసే ప్రయత్నం చేసినా మిగతా వారు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమా సుల్తానా(33), ఫర్గానా(52 నాటౌట్), రుమానా అహ్మద్(42 నాటౌట్) రాణించడంతో బంగ్లా అలవోకగా గెలిచింది. భారత ప్లేయర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42), దీప్తి శర్మ(32) మాత్రమే చెప్పుకోదగ్గస్థాయిలో బ్యాట్‌ తో ఆకట్టుకోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది భారత్. బంగ్లా బౌలర్లలో రుమానా(3/21) భారత్‌ ను కట్టడి చేసింది. గురువారం (జూన్-7) శ్రీలంకతో ఢీకొట్టనుంది భారత్. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆల్ ద బెస్ట్ టీమిండియా.

Posted in Uncategorized

Latest Updates