పాకిస్తాన్ సెనేట్ లో హిందూ మహిళ

kumariవిదేశాల్లో భారతీయ సంతతికి చెందిన వాళ్లు ఉన్నత ఉద్యోగాలతో పాటు…పదవుల్లో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్‌ పార్లమెంటు ఎగువ సభ (సెనేట్‌)లో ఓ హిందూ మహిళ సభ్యురాలు కాబోతోంది. పాక్‌ సింధ్‌ ప్రాంతంలోని కోహ్లి తెగ (ఎస్సీ)కు చెందిన కృష్ణకుమారి (38) పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) తరఫున పార్లమెంటు ఎగువ సభకు పోటీ చేయనున్నారు. మార్చి 3న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే తొలి హిందూ మహిళా సెనేటర్‌గా రికార్డు సృష్టించనున్నారు. సామాజిక కార్యకర్త అయిన కృష్ణకుమారి తన సోదరుడితో కలిసి పీపీపీలో చేరారు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి ఓ భూస్వామి నిర్బంధంలో ఉన్నారు. 16 ఏళ్ల వయసులో లాల్‌చంద్‌ను పెళ్లాడిన కృష్ణకుమారి.. ఆయన సహకారంతో సింధ్‌ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. థార్‌ ప్రాంతంలో పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు కృష్ణకుమారి.

Posted in Uncategorized

Latest Updates