పాకిస్థాన్ ఎన్నికలు : షరీఫ్ – ఇమ్రాన్ మధ్య హోరాహోరీ

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. పార్లమెంట్ తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటుకు 3వేల 675మంది, శాసనసభకు 8వేల 895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభావం కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించిందని పాక్ టీవీలు వెల్లడించాయి. పాక్ దేశవ్యాప్తంగా 85వేల పోలింగ్ కేంద్రాల్లో.. 10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఈసారి మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పాక్  మాజీ ప్రధాని నవాజ్  షరీఫ్ కు చెందిన అధికార పాకిస్థాన్  ముస్లిం లీగ్, మాజీ క్రికెటర్  ఇమ్రాన్  ఖాన్  నేతృత్వంలోని పాకిస్థాన్  తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్, బిలావల్ బుట్టో జర్ధారీకి చెందిన పాకిస్థాన్  పీపుల్స్ పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ .. పాకిస్థాన్  తెహ్రీక్ -ఎ-ఇన్సాఫ్ కు ఈసారి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు అంచాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates