మీ జన్మధన్యం సార్ : పాకిస్తాన్ నుంచి రాజమౌళికి ఆహ్వానం

rajaబాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి.  బాహుబలికి మరో అరుదైన గౌరవం దక్కింది. పాకిస్తాన్‌ లోని కరాచీలో జరగనున్న పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఇందుకు గాను.. రాజమౌళికి పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.

ఎన్నో దేశాలను సందర్శించే అవకాశం బాహుబలి సినిమా నాకు కలిగించింది. అన్నింటికి మించి ఇప్పుడు పాకిస్తాన్‌ వెళ్లబోతున్నాం. త్వరలో కరాచీలో జరగనున్న పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అంటూ రాజమౌళి ట్వీట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates