పాకిస్ధాన్ జైళ్లలో 471మంది భారతీయులు

priపాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయ ఖైదీలు శిక్షను అనుభవిస్తారని ఆదివారం(జులై-1) భారతీయ హై కమిషన్‌కు పాకిస్ధాన్ ఓ జాబితాను సమర్పించింది. భారత్ కు చెందిన 418 మంది మత్స్యకారులు, 53 మంది ఇతరులు పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్నట్లు పాక్ తెలిపింది. అక్రమంగా తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకే వారిని అరెస్ట్ చేయడం జరిగిందని పాక్ తెలిపింది. మే 21, 2008లో భారత్-పాక్ ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం…ప్రతి ఏటా జనవరి-1,జూలై-1 న ఇరుదేశాల జైళ్లలో ఉన్న ఖైదీల సమాచారాన్ని  రెండుదేశాలు పరస్పరం అందించుకుంటాయి. అందులో భాగంగానే ఈ రోజు పాక్ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల వివరాల జాబితాను భారత్ కు అందించినట్లు పాకిస్థాన్ విదేశీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates