పాక్ ఎన్నికలు : లీడింగ్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ

పాకిస్తాన్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేయడంతో … 31 మంది చనిపోయారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. కొన్ని గంటల్లో రాజకీయ పార్టీల ఫ్యూచరేంటో తేలనుంది.
పాకిస్తాన్ లో 11వ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు బలూచిస్తాన్, క్వెట్టాలో ఉగ్రవాద దాడులు జరిగాయి. టెర్రరిస్టులు పలుచోట్ల ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 31 మంది చనిపోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రదాడులకు నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ జనం పోలింగ్ బూత్ లకు వచ్చారు. సుమారు 3 లక్షల 70 వేల మందికి పైగా బలగాలు ఎన్నికల భద్రతలో పాల్గొన్నాయి. అయినా అక్కడక్కడా దాడులు జరగడం ఓటర్లను భయపెట్టింది. సూసైడ్ బాంబర్స్ కు తామే కారణమని ఐసిస్ క్లెయిమ్ చేసుకుంది. క్వెట్టా దాడి తమ పనేనని ప్రకటించింది.
ఇక వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీస్ సయీద్ లాహోర్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు. సాధారణ ఓటర్లలాగే వచ్చి ఓటేశాడు. అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపున తన అభ్యర్థుల్ని పోటీలో పెట్టాడు సయీద్.
272 పార్లమెంట్ నియోజకవర్గాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ.. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్ పార్టీ హోరాహోరీగా పోటీపడ్డాయి. PTI-PML మధ్యే టైట్ ఫైట్ జరిగిందని సర్వేలు అంచనా వేశాయి. ఇమ్రాన్ పార్టీకి సైన్యం, ఐఎస్ఐతో పాటు ఇస్లామిక్ ఛాందసవాదులు మద్ధతిచ్చాయి. PTIనే గెలవొచ్చని PPP బరిలో ఉన్నా… పోటీ నామమాత్రమేనని చెబుతున్నారు పరిశీలకులు.
ఈ ఎన్నికలు పార్టీల మధ్య పోరుకంటే.. మోసం, దగా, మిలటరీ నీడలో జరుగిన ఎన్నికలుగా అభివర్ణించారు అంతర్జాతీయ నిపుణులు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన PTI పార్టీకి మిలటరీ మద్ధతుందన్న ఆరోపణల వెల్లువెత్తాయి. గురువారం ఉదయం పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates