పాక్ ఎన్నికల్లో జనరల్‌ కేటగిరీలో విజయం సాధించిన తొలి హిందువు

 పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్‌ కేటగిరీలో విజయం సాధించిన తొలి హిందువుగా చరిత్ర సృష్టించాడు మహేశ్‌ కుమార్‌ మలానీ. థార్‌పార్కర్‌ నియోజకవర్గం నుంచి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తరఫున మహేశ్‌ బరిలోకి దిగారు. సమీప అభ్యర్థి గ్రాండ్‌ డెమొక్రటికల్‌ అలియన్స్‌కు చెందిన అరబ్‌ జాకవుల్లాపై గెలుపొందారు ఆయన. మహేశ్‌ మలాని పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రహ్మణ కుటుంబానికి చెందినవాడు. 2003లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్‌డ్‌ సీటుకు నామినేట్‌ అయ్యారు ఆయన.  2013లో సింధ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు మలానీ.

Posted in Uncategorized

Latest Updates