పాక్ కాల్పులు..ఇద్దరు జవాన్లు మృతి

KILLసరిహద్దులో పాక్ సైన్యం రెచ్చిపోతూనే ఉంది. ఆదివారం (జూన్-3) పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ASI, మరో కానిస్టేబుల్ చనిపోయారు. ASI నారాయణ్ యాదవ్, కానిస్టేబుల్ విజయ్ కుమార్ పాండే అమరులయ్యారు. మరో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. వారినిస్థానిక హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాల్పుల దాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి. రాత్రి రెండున్నర టైంలో కాల్పులు ప్రారంభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. భయంతో రాత్రంగా మెలకువతోనే ఉన్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates