పాక్ కు బ్రహ్మోస్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్..DRDO ఇంజనీర్ అరెస్ట్

మహారాష్ర్ట :  పాకిస్థాన్ కు బ్రహ్మోస్ మిస్సైల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడన్న ఆరోపణల పై..  నాగ్ పూర్ లోని DRDOలోని  బ్రహ్మోస్ ఏరో స్పేస్ సిస్టమ్ ఇంజనీర్ నిషాంత్ అగర్వాల్ ను యూపీ యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్, మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారులు సోమవారం(అక్టోబర్ 8) అరెస్ట్ చేశారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లో నిషాంత్ నాలుగేళ్లుగా సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

టెక్నికల్ సమాచారాన్ని పాకిస్థాన్,అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందించాడని అధికారులు అనుమానిస్తున్నారు. కాన్పూర్ లో పట్టుబడిన ఐఎస్ఐ ఏజెంట్,ఇద్దరు DRDO ఉద్యోగులను ప్రశ్నించగా నిషాంత్ పేరు బయటకు వచ్చినట్లు పోలీసులు చెపుతున్నారు. ఐఎస్ఐ ఏజెంట్ తో నిషాంత్ ఫేస్ బుక్ లో చాట్ చేసినట్లు వారు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates