పాక్ నుంచి కాల్పులు : భారత భూగంలో ఐదుగురి మృతి

JAWANపాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం (మే-18) జమ్మూకశ్మీర్‌లోని సరిహద్ధు ప్రాంతమైన RS పురా సెక్టార్లలో దాడులు చేసింది. నలుగురు పౌరులు చనిపోగా.. ఒక బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన BSF కానిస్టేబుల్ ను సీతారాం ఉపాధ్యాయ్ గా గుర్తించారు. ఇక అర్నియా సెక్టార్  లో పాకిస్తాన్ సైన్యం హద్దులు దాటింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో.. మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. పాక్ బరితెగింపుపై సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది భారత ఆర్మీ.

ఒకే రోజులు నలుగురు పౌరులతోపాటు ఓ జవాన్ చనిపోవటాన్ని భారత్ ఆర్మీ సీరియస్ గా తీసుకుంది. సరిహద్దుల్లోని RS పురా సెక్టార్ లోని బలగాలు రాకెట్ లాంఛర్లు, మోటార్లతో పాక్ పై విరుచుకుపడ్డారు. పాక్ కాల్పులను తిప్పికొట్టారు. భారత్ దాడిలో కొన్ని బంకర్లు కూడా ధ్వంసం అయినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయంటున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates