పాక్ పై క్రికెటర్ల మాటల తూటాలు : ఆఫ్రిదీ ఎవడు.. వాడికి బుద్దిలేదన్న టీమిండియా

kohiకశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీపై టీమిండియా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన జాతి ప్రయోజనాలను వ్యతిరేకించే ఎవరి అభిప్రాయాలకూ తన మద్దతు ఉండదన్నారు విరాట్ కోహ్లి. ఒక భారతీయుడిగా ఎల్లప్పుడూ దేశానికి మంచి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు కోహ్లీ. తనకు సంబంధించినంత వరకూ దేశ ప్రయోజనాలే ఫస్ట్ అని ట్వీట్ చేశాడు కోహ్లి.

అసలు అఫ్రిదీ ఎవడు? అతడికి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అటువంటి వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. బుద్ధి మాంద్యం ఉన్న అఫ్రిది దృష్టిలో UN అంటే అండర్ 19 అని, అతని వ్యాఖ్యలను మీడియా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని గంభీర్ ట్వీట్ చేశాడు. కశ్మీర్‌లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్రం కోసం పోరాడుతున్న అమాయకులను అణచివేస్తున్నారని.. ఈ విషయంలో యునైటెడ్ నేషన్ జోక్యం చేసుకోవాలంటూ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates