పాక్ పోలింగ్ లో హింసాత్మకం : బాంబు దాడిలో 30 మంది మృతి

పాక్ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో పాక్ నేతలు తమ వక్రబుద్ధిని చూపించారు. బుధవారం (జూలై-25) క్వెట్టాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు పోలీసులు. గాయపడినవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. బూత్ బయట ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌ లో సమీపంలో పేలని గ్రనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాకిస్థాన్ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. రక్తపుటేరులు పారాయి. పోలింగ్ బూత్‌ ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ ను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపుచేసే పనిలో ఉన్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates