పాక్ బరితెగింపు : నలుగురు జవాన్ల మృతి

INDజమ్ముకశ్మీర్‌లో ఆదివారం(ఫిబ్రవరి-4) సాయంత్రం రాజౌరి సరిహద్దు ప్రాంతంలో బార్డర్ లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు ప్రాణాలు కొల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అంతకుముందు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దు రేఖ వెంబడి ఉన్న పూంచ్‌, రాజౌరిజిల్లాలలోని భారత సైనిక స్థావరాలపై పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ దాడుల్లో పూంచ్‌లో బాలికతో పాటు, ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్‌ సెక్టార్‌ బార్డర్ వద్ద పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. పౌరులను లక్ష్యంగా చేసుకొని పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన వీరిద్దరినీ చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వ్యవధిలో పాక్‌ ఆర్మీ కాల్పులకు తెగబడటం ఇది రెండో సారి.

Posted in Uncategorized

Latest Updates