పాక్ బలుపు : సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్లు

pak-chopper_sakshiపాకిస్థాన్‌ మరోసారి హద్దు మీరింది. సరిహద్దులో పిల్ల చేష్టలు ఆడబోయింది. ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్‌ హెలికాప్టర్లతో దేశంలోకి చొరబడే దుస్సాహాసానికి ఒడిగట్టింది.  మూడు హెలికాప్టర్లతో పాక్‌ ఆర్మీ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది.

పూంచ్‌ సెక్టార్‌లోని 300 మీటర్లలోపలికి హెలికాప్టర్లు వచ్చాయి. భారత ఆర్మీ ఈ దృశ్యం చూసి అప్రమత్తం అయింది. దీంతో వెంటనే పాక్‌ ఆర్మీ హెలికాప్టర్లు తోకముడిచాయి. వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఏ మాత్రం అవి ఆలస్యం చేసినా భారత బలగాల చేతులో నేలకూలి పెను సంచలనంగా మారేది. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పాక్‌ హైకమిషనర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, పాక్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే యోచన చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates