పాక్ మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అల్‌ అజీజియా స్టీల్ మిల్స్‌ అవినీతి కేసులో నవాజ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. అలాగే 25 మిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు తీర్పునిచ్చింది. నవాజ్‌పై ఉన్న ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్టిమెంట్ కేసును కొట్టివేశారు. నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో గతేడాది సెప్టెంబర్‌ 8న నవాజ్‌ షరీఫ్‌పై మూడు కేసులు నమోదు చేసింది. అవెన్‌ఫీల్డ్‌ ఆస్తుల కేసు, ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కేసు, అల్‌ అజీజియా కేసు నవాజ్‌పై నమోదు చేశారు. వీటిలో అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీస్‌ కేసులో నవాజ్‌కు 11ఏళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన రెండు కేసుల్లో తీర్పును జడ్జి ముహమ్మద్‌ అర్షద్‌ మాలిక్‌ రిజర్వ్‌ చేశారు. బెయిల్‌పై లాహోర్‌లో ఉన్న నవాజ్‌… తీర్పు సందర్భంగా ఇస్లామాబాద్‌కు వచ్చిన ఆయన… తలదించుకునే పనులేమీ చేయలేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates