పాక్ రావడం సంతోషంగా ఉంది : నోబల్ గ్రహీత మలాలా

malalaఅయిదున్నరేళ్ల తర్వాత స్వదేశానికి(పాకిస్థాన్‌కు) రావడం సంతోషంగా ఉందన్నారు నోబల్ బహుమతి గ్రహీత మలాలా. ఇస్లామాబాద్‌లో ప్రధాని నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఇవాళ మాట్లాడింది మలాలా. మొదట ఉర్దూలో మాట్లాడి.. ఆ తర్వాత పాస్తో భాషలో తన ప్రసంగాన్ని కొనసాగించింది ఆమె. సొంత మనుషుల మధ్య స్వదేశంలో కాలు మోపడం సంతోషంగా ఉందని తెలిపింది మలాలా. ప్రపంచదేశాల్లో తిరుగుతున్నప్పుడు తనకు పాకిస్థాన్ గుర్తుకు వచ్చేదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఎటువంటి భయం లేకుండా, వీధుల్లో తిరుగుతూ ప్రజలతో శాంతియుతంగా గడిపాలని ఆశిస్తున్నట్లు చెప్పింది ఆమె. 2012లో తాలిబన్లు దాడి చేసిన తర్వాత పాక్‌ను వదిలి వెళ్లింది మలాలా. అయిదున్నరేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఆ దేశంలో అడుగుపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates