పాక్ లో రచ్చో రచ్చ : శివుడి రూపంలో ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ లో ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతుంది. అందులోనూ మత పరమైన అంశంలో. దీనికి కారణం మాజీ క్రికెటర్, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఐ- ఇన్సాఫ్‌ (PTI) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కావటం విశేషం. అసలు విషయం ఏంటంటే.. శివుడి రూపంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి పాక్ సోషల్ మీడియాలో వైరల్ కావటం. ఇమ్రాన్ ఖాన్ ను పరమ శివుడు ప్రతిరూపంగా చిత్రీకరిస్తూ.. కొంత మంది ప్రచారం చేశారు. ఆయన ఫొటోలను శివుడిగా మార్చేశారు. ఈ విషయంపై.. పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది.

ఈ ఫోటోతో విద్వేష ప్రసంగాలు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందూ ప్రతినిధులు సభలో ఆందోళనకి దిగారు. అసెంబ్లీ స్పీకర్‌ సర్ధార్‌ అయాజ్‌ సాధిక్‌ ఈ అంశాన్ని దేశీయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫోటో క్రియేట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీస్, ఐటీ శాఖలను కూడా ఆదేశించారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

పాక్ లో నివసించే హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఐ- ఇన్సాఫ్‌ (PTI) తెలిపింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం విడిచి వెళ్లిన హిందువులను.. తిరిగి పాకిస్తాన్‌ రావచ్చని, వారికి ఘనంగా ఆహ్వానం పలుకుతాం అని గతంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ ను శివుడితో పోల్చుతూ ఫొటోలు పాక్ సోషల్ మీడియాలో బీభత్సం చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates