పాక్ లో హిందూ ఆలయం: అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయింపు

pakistan templeముస్లిం దేశంలో హిందూ దేవాలయం..దానికి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది అక్కడి ప్రభుత్వం. ఇది ఎక్కడో తెలుసా పాకిస్తాన్ లో… వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ…కానీ నిజం. రావల్పిండి, ఇస్లామాబాద్‌ జంటనగరాల్లో ఓ పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఆ దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. పండుగల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాల్లో హిందువులు భారీ సంఖ్యలో దర్శనం కోసం వచ్చినప్పటికీ ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని పునరుద్ధరించనున్నారు.

కొత్తగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని అదనపు పరిపాలనాధికారి ఆసిఫ్‌  తెలిపారు. 1897లో కంజీమాల్, రామ్‌ రచ్‌పాల్‌ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్‌ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి తెలియజేయటంతో పాక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి  కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని… దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అధికారులు.

ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో పూజలందుకుంటున్న ఏకైక హిందూ ఆలయం ఈ కృష్ణ దేవాలయం.

Posted in Uncategorized

Latest Updates