పాట్నాలో భారీ వర్షాలు : హస్పిటల్ లోకి చేప పిల్లలు

భారీ వర్షాలు పడితే నింగి నేలా ఏకమైందన్నారు. అయితే బిహార్ లో చెరువులు ఊళ్లు ఏకమైపోయాయి. ఇక్కడ చూస్తున్న చేప పిల్లలు ఏ చెరువులోనివో.. కుంటలో ఉన్నవో కాదు. ఇవి ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనివి. మెడికల్ కాలేజీలో చేప పిల్లలకేం పని అనుకోకండి. ఇందులో వాటి తప్పేం లేదు. ఎందుకంటే భారీ వర్షాలతో చెరువులు, ఊళ్లు ఒక్కటవ్వడంతో పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఐసీయూలోకి ఇలా చేప పిల్లలు పిక్నిక్ కి వచ్చాయి. పేషెంట్లు వేసే ఆహారపదార్థాలు తింటూ హాస్పిటల్ మొత్తం చుట్టేస్తున్నాయి. నీరు ఎటూ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పేషెంట్లు కూడా అదే నీటిలో కాలం గడిపేస్తున్నారు. ఉన్న రోగాలు తగ్గాలని హాస్పిటల్ కు వస్తే కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.


Posted in Uncategorized

Latest Updates