పాట లొల్లి : సుప్రీంకోర్టుకి వెళ్లిన ప్రియా వారియర్

Priya-Prakash-Varrierప్రియా ప్రకాశ్ ..ఇప్పుడు ఈ పేరు ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాశ్ కు ప్రశంసలతో పాటు విమర్శలు వచ్చాయి. ఆమె నటించిన మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్ లోని మాణిక్య మలరాయ పూవీ సాంగ్‌ను తొలగించాలని ముస్లిం సంఘాల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయితే సినిమా యూనిట్‌పై కేసు నమోదును ఛాలెంజ్ చేస్తూ..ఒరు ఆదార్ లవ్ హీరోయిన్ ప్రియాప్రకాశ్ వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాటలోని లిరిక్స్ ముస్లింల మనోభావాలు అగౌరవపరిచేలా ఉన్నాయంటూ కొంతమంది యువకులు హైదరాబాద్ ఫలక్‌నుమా పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates