పాతబస్తీలో కాల్పులు

హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.హుసేనీ ఆలం స్టేషన్ పరిధిలో ఫతేదర్వాజా ప్రాంతంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. సాదేఖ్, షేక్ ఉమర్ అనే ఇద్దరి మధ్య మొదలైన గొడవ కాస్త కాల్పుల వరకు దారితీసింది. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో సాదేఖ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన సాదేఖ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి 0.32 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates