పాపం ఊరికే పోదు : ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి

ఎంతో మంది ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. ఆ పాపం ఊరికే పోలేదు. అమాయక ప్రజల ఉసురు తగిలి, నానా హింస పడుతున్నాడు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్ అజార్. భారత్ లో పలు ఉగ్రదాడులకు కేరాఫ్ గా నిలిచిన మసూద్ ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్‌ చీఫ్‌ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనాడు.

యూరి దాడికి బాధ్యుడైన మసూద్‌ అజార్‌ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్‌ మిలటరీ హస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది PTI.  మసూద్‌ అజార్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల లిస్టులో ఉంది. 2016లో పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్‌ లో దాడికి సంబంధించి జైషే చీఫ్‌ మసూద్‌ ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్‌ లో ఉంచింది.  2017 నాగర్‌ కోట దాడిలోనూ మసూద్‌ ఆజాద్‌ కీలకంగా వ్యవహరించాడు.

 

 

Posted in Uncategorized

Latest Updates