పాపం నాగం : చీటికి మాటికి పార్టీలు మారితే అంతే…

nagam-janarthan-reddy కాంగ్రెస్‌ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అన్నారు కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి. అరె నేను పార్టీ మారాను కదా…అని గుర్తొచ్చి నాలిక కరుచుకున్నారు… అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్‌ఎస్‌ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని సవరించుకొన్నారు. ఇవాళ హైదరాబాద్ పార్టీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నాగం విలేకర్ల సమావేశం ప్రారంభిస్తూ కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అనడంతో విలేకర్లు పగలబడి నవ్వారు…దానితో విషయం అర్థమై సవరించుకున్నాడు ఆయన. తెలుగు దేశం నుంచి బీజేపీలో చేరాడు నాగం. ఆ పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో…ఇటీవల కాంగ్రెస్ లో చేరాడు. ఈ పార్టీలో కూడా ఆయనకు ఆదరణ కరువైంది. కాంగ్రెస్ ఓ మహాసముద్రం…ఎవడికి వాడే నాయకుడు. ఇక్కడ నాగం పరిస్థితి అగమ్యగోచరమే…ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు…కానీ టీఆర్ ఎస్ ను విమర్శించాలనుకొన్నాడు…కానీ కాంగ్రెస్ ను విమర్శించాడు…చీటికిమాటికి పార్టీలు మారితే ఇంతేనని గున్కుకున్నారు పాత్రికేయులు.

Posted in Uncategorized

Latest Updates