పాముతో పరాచకమాడుతున్న పసిడిబొమ్మ

nivetha-thomas2ఎంతో ఆశ్యర్యంగా ఉంది…ఓ అందాలబొమ్మ పాముతో సయ్యాటలాడుతుంది. మూమూలుగానైతే పామును చూసినా వామ్మో అంటూ భయంతో పరుగులు తీస్తుంటాం. కానీ టాలీవుడ్ నటి నివేదా థామస్ మాత్రం ఓ కొండచిలువతో హాయిగా ఆడుకుంటూ కొన్ని ఫొటోలు దిగింది. ‘బాబ్రా (కొండచిలువ)ను కలిశాను. చాలా చిన్న మంచి విషయం. నేను అనుకున్నంత చిన్న విషయమేం కాదంటూ’ కొండ చిలువతో దిగిన ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఆ అమ్మడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది.

అమ్మ బాబోయ్  ఈ సుందరికి ఎంత ధైర్యం పాముతో ఆడుకుంటుందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నటి ఇలా ప్రమాదకర ప్రాణులతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే నాని హీరోగా నటించిన జెంటిల్‌మెన్ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది ఆపై నిన్నుకోరి, జైలవకుశ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించారు.

Posted in Uncategorized

Latest Updates