పారా మెడికల్ కోర్సులకు 3 నుంచి 6వరకు వెబ్ కౌన్సెలింగ్

వరంగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది  కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది యూనివర్సిటీ యాజమాన్యం. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపింది యాజమాన్యం. ఈ మేరకు నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు బాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి ( బీపీటీ ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ ( బీఎస్సీ ఎంఎల్‌టీ ) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను పొందుపరుచుతామని తెలిపారు యూనివర్సిటీ అధికారులు. పీహెచ్ అభ్యర్థులతో సహా అర్హులైనవారందరూ కోర్సు, కళాశాల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.in చూడాలని తెలిపారు రిజిస్టార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్.

Posted in Uncategorized

Latest Updates