పార్కింగ్ స్కీమ్ : ఖాళీ స్థలాలు ఇవ్వండి.. డబ్బులిస్తాం

_KTRనగరంలో ఖాళీ స్థలాలున్నవారు.. వాటిని పెట్టుబడి లేకుండా ఆదాయ వనరుగా మార్చుకొమ్మని పిలుపునిచ్చారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్‌లో పార్కింగ్‌ వసతి కల్పన కష్టమవుతుండడం, ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం ‘ఆఫ్‌ స్ట్రీట్‌ పార్కింగ్‌’నుఅందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి మాకు సహకరించండి. మీ ఖాళీ స్థలాన్ని అనుమతి ఉన్న పార్కింగ్‌ లాట్‌గా మార్చుకోండి.. ఆదాయం పొందండి’ అని మంగళవారం ట్వీట్‌ చేశారు కేటీఆర్. నగరంలో గ్రిడ్‌లాక్‌గా మారిన రహదారులపై ట్రాఫిక్‌ ఇబ్బందులను కొంత మేరకైనా తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కసరత్తు చేస్తూనే.. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ వసతి కల్పించాలని భావిస్తున్నారు మంత్రి. తమ స్థలాలు, భవనాల్లో పార్కింగ్‌ వసతి కల్పించాలనుకునే వారు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఆ సంస్థ నిర్ణయించిన రుసుము వసూలు చేసుకోవచ్చునని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జీహెచ్‌ఎంసీ ఎస్టేట్స్‌ అదనపు కమిషనర్‌ రమే్‌షను 99495 46622, 040- 2111 1111 నెంబర్లలో సంప్రదించవచ్చు. లేదా acestatehousing@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. వినతులు వచ్చాక క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి.. మూడు నుంచి ఆరు నెలల్లోపు అనుమతి ఇస్తారు. జీహెచ్‌ఎంసీకి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates