పార్టీలకు కొత్త రూపు ఇచ్చాడు : నైట్ క్లబ్బుల రారాజు పీటర్ స్ట్రింగ్ కన్నుమూత

night-clubక్లబ్.. నైట్ క్లబ్ అంటే ఏదో నాలుగు పెగ్గులు కొట్టటం, పేకాట ఆడటం, పాటలు పాడటం వరకే మాత్రమే ఉండేది పీటర్ రానంత వరకు.. 1960లో నైట్ క్లబ్ బిజినెస్ లోకి పీటర్ స్ట్రింగ్ ఫెలో దిగిన తర్వాత ఆ స్వరూపమే మారిపోయింది. నైట్ క్లబ్ అంటే నగ్నత్వం, విచ్చలవిడితనం, కాసినోలుగా మారిపోయాయి. మన దేశంలో అక్కడ అక్కడ ఉండే డాన్స్ బార్లు కూడా పీటర్ సృష్టించినవే. ప్రపంచం మొత్తం నైట్ క్లబ్ రారాజుగా గుర్తింపు పొందిన పీటర్ జూన్ 7వ తేదీ ఉదయం లండన్ లోని తన స్వగృహంలో చనిపోయాడు. మూడేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నా.. చనిపోయే వరకు ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియనీయలేదు. తన మూడో భార్య, ఐదుగురు పిల్లల సమక్షంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు.

13 ఏళ్ల వయస్సులోనే పనిచేయటం ప్రారంభించిన పీటర్.. కార్పెట్స్ దొంగతనం చేసిన కేసులో రెండు వారాలు జైల్లో ఉండి వచ్చాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. జైలు నుంచి వచ్చిన తర్వాత నైట్ క్లబ్ లో పనికి కుదిరాడు. అక్కడ కస్టమర్ల అభిరుచులు ఏంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత తానే స్వయంగా నైట్ క్లబ్ బిజినెస్ లోకి దిగాడు. అప్పటి వరకు ఉన్న నైట్ క్లబ్ స్వరూపాన్ని మార్చేశాడు. తన నైట్ క్లబ్ లో అమ్మాయిల నగ్న ప్రదర్శనలతో ప్రపంచం దృష్టికి ఆకర్షించాడు. జీవితం చాలా చిన్నది.. దాన్ని అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అంటాడు పీటర్. నిత్యం ఆనందంగా.. సంతోషంగా గడపాల్సిన జీవితాన్ని టెన్షన్ లతో వృధా చేసుకోవద్దని చెబుతాడు. చెప్పటమే కాదు.. తన జీవితాంతం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో ఇంత కంటే బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తి కూడా లేకపోవచ్చు అంటారు అతని సన్నిహితులు, ఆప్తులు. వాళ్లూ వీళ్లు అనటం కాదు.. పీటర్ స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పటి వరకు నాకు 2వేల మంది యువతులతో పరిచయం ఉందని ప్రకటించి సంచలనం రేపాడు.

లండన్ లోనే కాకుండా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, పారిస్, మియామితోపాటు వివిధ నగరాల్లో సొంత బ్రాండ్ క్రియేట్ చేశాడు. హైఫై పార్టీలంటే చాలు.. పీటర్ కు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. యువరాణి డయానా ఇచ్చిన పార్టీలో పీటర్ చేసిన సందడి.. అప్పట్లో సంచలనం అయ్యింది. లండన్ లో ఓ సెలబ్రిటీ హోదాతోపాటు.. ప్రతి సెలబ్రిటీకి పీటర్ నైట్ క్లబ్ ఓ అడ్డా. ప్రిన్స్, మార్విన్ గయే, రాడ్ స్టీవర్ట్, టామ్ జోన్సన్ పేరుతో హైపై నైట్ క్లబ్బులు నిర్వహించాడు. ప్రపంచం మెచ్చిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.. వీల్ చైర్ లోనే ఉండి.. స్ట్రింగ్ ఫెలో నైట్ క్లబ్ లో కొన్ని రోజులు గడిపారు. హాకింగ్ కు కావాల్సిన సౌకర్యాలను తానే స్వయంగా చూడటం విశేషం. తాను చనిపోతే ఈ ప్రపంచానికి కూడా చెప్పొద్దు అంటాడు ఈ నైట్ క్లబ్ రారాజు స్ట్రింగ్ ఫెలో. తాను చనిపోయిన రోజు కూడా తన నైట్ క్లబ్బులు ఆనందం పంచాలన్న తన చివరి కోరిక మేరకు వాటిని తెరిచే ఉంచాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates