పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం :  సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌‌ : పార్టీ ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారంతో సమానమని, సీఎం కేసీఆర్‌‌కు భారీ మెజార్టీ వచ్చాక కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాక్కో వడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ప్రధాని మోడీకి పర్సనల్‌ సెక్రెటరీగా కేసీఆర్‌‌ వ్యవహరిస్తున్నారన్నారు. మోడీ ఉప్పు తిన్నాడు కాబట్టే రుణం తీర్చు కోవడానికే కేసీఆర్‌‌ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంప్యూటర్లపై నిఘాపెట్టడం సరికాదని, భార్యభర్తల కాపురంపై కూడా కేంద్రం నిఘా పెట్టేలా ఉందని మండపడ్డారు. సోహ్రబుద్దీన్‌ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాం డ్‌ చేశారు.

సీట్ల సర్దుబాటు ఆలస్యమే కూటమి కొంపముంచిందనీ, కేసీఆర్‌‌ కనుసన్నుల్లోనే ఎలక్షన్‌ కమిషన్‌ పనిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌‌రెడ్డి అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

Posted in Uncategorized

Latest Updates