పార్లమెంట్ ఆవరణలో పరమ’శివుడు’.. మోడీపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ పార్లమెంట్ ఆవరణలో నిరసన కొనసాగిస్తున్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. నారద మునిగా, కట్టబొమ్మన్ గా, విద్యార్థిగా, సత్యహరిశ్చంద్రుడిగా, జానపదకళాకారుడిగా.. ఇలా అనేక వేశాల్లో ఇప్పటికే నిరసన తెలిపిన ఎంపీ శివప్రసాద్ ఇవాళ శుక్రవారం శివుడి అవతారం ఎత్తారు.

త్రిశూలం పట్టుకుని… మెడలో బొమ్మపాముతో శివుడి అవతారంలో పార్లమెంట్ ఆవరణలో హల్చల్ చేశారు శివప్రసాద్. వారణాసిలో గెలిచినా కూడా మోడీ అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. విభజన చట్టంలో చెప్పిన హామీలను ఇప్పటికైనా కేంద్రం నెరవేర్చాలన్నారు. లేకపోతే 2019 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ మూడో కన్ను తెరిచి మోడీని భస్మం చేస్తారని అన్నారు.


Posted in Uncategorized

Latest Updates