పార్లమెంట్ కు పోటీ చేస్తా: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి. ఈ విషయాన్ని ఇప్పిటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన…20 ఏళ్లుగా ప్రజలతోనే మమేకమై ఉన్నానన్నారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ సభ్యుడిగా జిల్లా నాయకుల అందరి సహాయంతో తప్పకుండా పోటీచేస్తానని తెలిపారు.

రాబోయే సర్పంచ్ ఎన్నికలను …కాంగ్రెస్ కార్యకర్తలు ఛాలెంజ్‌గా తీసుకొని ఎక్కువ సర్పంచ్‌లను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో సర్పంచ్‌లకు నిధులు ఇవ్వలేదని ఆరోపించిన  కోమటి రెడ్డి… కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు.

అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Posted in Uncategorized

Latest Updates