పార్లమెంట్ బయట కొట్టుకున్నంత పని చేసిన ఎంపీలు

అసోం రాష్ట్రంలో స్థానికేతరుల అంశం పార్లమెంట్ ను కుదిపేసింది. 40 లక్షల మందిని భారతీయులుగా గుర్తించేందుకు నిరాకరిస్తూ విడుదల అయిన జాబితాపై లోక్ సభలో పార్టీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే సభలో బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల మా రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ ఆందోళనల మధ్యే సభ నుంచి బయటకు వచ్చిన బెంగాళీ అయిన ప్రదీప్ భట్టాచార్య, బీహారీ అయిన అశ్విని చౌబేలు వాదులాడుకోవటం కనిపించింది.

ఈ సమయంలో బీహార్ ఎంపీ చౌబే మాట్లాడుతూ అది బెంగాల్ కావొచ్చు, అసోం కావొచ్చు.. ఏ రాష్ట్రంలో అయినా సరే దేశం కాని వారు వెంటనే వెళ్లిపోవాలన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారు తీవ్రవాదులతో లింక్ పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు. శరణార్ధులకు దేశం ధర్మశాల కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ భట్టాచార్య తీవ్రంగా విబేధించారు. రాజీవ్ గాంధీని ఈ విషయంలోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీకు చేతగాక.. మాపై నిందలు వేస్తున్నారా అంటూ భట్టాచార్య అనటంతో.. ఈ ఇద్దరు ఎంపీలతో మాటకు మాటతో ఆగ్రహంతో ఊగిపోయారు. కొట్టుకున్నంత పని చేశారు పార్లమెంట్ బయట. విషయం పెద్దది అవుతుండటంతో.. మిగతా ఎంపీలు కలుగజేసుకుని శాంతింపజేశారు.

Posted in Uncategorized

Latest Updates