పార్లమెంట్ లో ఆఖరి ఫైట్.. నేటి నుంచి శీతాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్  శీతాకాల సమావేశాలు ఇవాళ(డిసెంబర్ 11) ప్రారంభం కానున్నాయి. జనవరి 8 వరకు  ఈ సమావేశాలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో జరిగే ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐఎంసీ) బిల్లులు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఇప్పటికే ఆమోదించింది. ఈ సమావేశాల్లో రాజ్యసభ ఆమోదం కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ట్రిపుల్‌‌‌‌ తలాక్ బిల్లు ఆమోదానికి లోక్ సభలో సహకరించినట్లుగానే రాజ్యసభలో కూడా సహకరించాలని అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఇప్పటికే త్రిపుల్ తలాక్ పై కేంద్రం ఆర్డినెన్స్ జారీ  చేసింది. సీబీఐ అంశం, రాఫెల్ డీల్, రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థల నుంచి పెరుగుతున్న ఒత్తిడి సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షా లు సిద్ధమవుతున్నాయి. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ లాంటి సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆందోళన చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ లో మొత్తం 66 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్డీఏ సర్కార్ కు చివరి సమావేశాలు కావడంతో తమకు అవసరమైన బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న(సోమవారం) ఢిల్లీలో బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ సమావేశమైన సమయంలో జరిగే ఈ సమావేశాలు, ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్షగా నిలవబోతున్నాయి. వచ్చే లోక్‌‌‌‌ సభ ఎన్నికలకు ఈ సమావేశాలను పునాదిగా మా ర్చుకోవాలని పార్టీలు చూస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates